విస్సన్నపేటలోని కెఎంఆర్ & ఎంఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న జూవాలజీ అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సి జంతుశాస్త్రంలో కనీసం 50 శాతం మార్కులు పొందిన వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 17న సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తులను కళాశాల కార్యాలయంలో అందజేయాలని చెప్పారు.