విజయవాడలో 6 కేజీల గంజాయి స్వాధీనం

విజయవాడలోని హనుమాన్ పేటలో స్థానికుల సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తాడేపల్లికి చెందిన ఒక వ్యక్తిని, ఒరిస్సాకు చెందిన మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ సుధాకర్ శుక్రవారం సాయంత్రం తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్