5 ఏళ్ల తర్వాత విజయవాడ బస్టాండ్లో బొమ్మ..!

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోని థియేటర్ ఐదేళ్ల తర్వాత మళ్లీ తెరచుకోనుంది. రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా ప్రీమియర్ షోను బుధవారం రాత్రి 8:10 గంటలకు ప్రదర్శించనున్నారు. కోవిడ్ సమయంలో మూతపడిన ఈ థియేటర్ను పునరుద్ధరించి, డాల్బీ సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు, విద్యార్థుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్