మాటల తగాదా ముదిరి కత్తితో దాడి

హైదరాబాద్‌లోని అమీన్‌పూర్‌లో రూ.10 కర్రీ విషయంలో తలెత్తిన వివాదం తీవ్రరూపం దాల్చింది. బీరంగూడ MRO ఆఫీస్ వద్ద కర్రీ పాయింట్ నిర్వహిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన గోలే ఉదయ్ భాను(21)పై శనివారం రాత్రి అంబేడ్కర్ కాలనీకి చెందిన జీవరత్నం కత్తితో దాడి చేశాడు. కర్రీ విషయంలో జరిగిన వాగ్వాదం ఈ ఘర్షణకు దారితీసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్