విజయవాడలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు కేసు నమోదైంది. పోలీసుల వివరాల మేరకు.. మొగల్రాజపురానికి చెందిన ఓ కుటుంబం వాచ్మెన్గా నివాసం ఉంటుంది. వారికి పరిచయమైన నిందితుడు చిన్నారావు బాలికతో పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా విషయం తెలిపింది. మంగళవారం సాయంత్రం మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.