ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధికార ప్రతినిధి కామరాజ్ హరీష్ కుమార్, టిడిపి మహానాడు వైసిపి అధ్యక్షులు జగన్ పై విష ప్రచార వేదికగా మారిందని తీవ్రంగా విమర్శించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో, చంద్రబాబు, లోకేష్ ల వైఖరిపై నిప్పులు చెరుగుతూ, మహానాడులో తమ పార్టీ బలం గురించి మాట్లాడే దమ్ములేక, కేవలం జగన్ నామస్మరణ చేయడమే పరమావధిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సూపర్ 6 ఒక పచ్చి మోసం అని, రెండేళ్ల బాబు పాలన దారుణ వైఫల్యం అని, ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. తల్లికి వందనం, మహిళలకు నెలకి ₹1500, ఉచిత సిలిండర్లు, నిరుద్యోగ భృతి వంటి హామీలను నెరవేర్చకుండా, నిస్సిగ్గుగా రెండేళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడుకు పేదల కష్టాలు పట్టవా అని నిలదీశారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను దగా చేసినందుకు చంద్రబాబు, లోకేష్ లు రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.