ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని గులాబీ తొటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన పెన్షన్ల పంపిణీ విధానాన్ని పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఇంటివద్దకే పెన్షన్లు పారదర్శకంగా, బాధ్యతతో, గౌరవప్రదంగా అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు.