ఇబ్రహీంపట్నం నేషనల్ హైవేపై ఆవులతో వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం-హైదరాబాద్ బస్ స్టాప్ వద్ద రోడ్డుకి ఇరువైపులా ఆవులు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. శనివారం రోడ్డు మధ్యలో పడుకున్న ఆవులు ఒక్కసారిగా పరిగెత్తడంతో బైకుపై వెళుతున్న వ్యక్తికి ఆవు తగిలి గాయాలు పాలయ్యాడు. రోడ్డు మధ్యలో ఆవులు రాత్రులు ఉండటం, ఉదయం లేచి పరిగెత్తడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.