SIRపై అందరూ అప్రమత్తంగా ఉండాలి: సజ్జల

YCP రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులను ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయంలో SIRపై జరిగిన సమావేశంలో, 2019 ఎన్నికలకు ముందు తమ పార్టీకి చెందిన 40-45 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారని, అప్పడే ఢిల్లీ వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. పార్టీ ఓట్ల అక్రమ తొలగింపును అడ్డుకోవాలని, జోన్ల వారీగా చురుకైన కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్