విజయవాడ సూర్యారావుపేటలో 22 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుంచి గంజాయిని తరలించి విజయవాడలో విక్రయిస్తున్న షేక్ కరీముల్లా, షేక్ షబ్బీర్, వెంకటేశ్వర్లు, దుర్గ వెంకట్, జీవన్ రాజుతో పాటు మరో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశారు. వీరిపై నిఘా పెట్టి, గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ చవాన్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో షేక్ కరీముల్లా రౌడీ షీటర్ అని వెల్లడించారు.