జోగి రమేష్ ఇంటిపై దాడి: దేవినేని అవినాష్ అరెస్ట్, 'జంగిల్ రాజ్యం' అంటూ విమర్శ

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నం వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అవినాష్, రాష్ట్రంలో ప్రస్తుతం 'జంగిల్ రాజ్యం' నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసి హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఇలాంటి పనులు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్