కృష్ణా: రైలు ప్రయాణికులకు అలర్ట్

విజయవాడ రైల్వే డివిజన్‌లో జరుగుతున్న మెయింటెనెన్స్ పనుల కారణంగా ఉమ్మడి కృష్ణా ప్రాంతం మీదుగా నడిచే కొన్ని రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జనవరి 31న 22876/75 గుంటూరు–విజాగ్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్, జనవరి 28, 29న 17219 మాచర్ల–ఉసూరుకోట ఎక్స్‌ప్రెస్, జనవరి 29, 30న 17220 ఉసూరుకోట–మాచర్ల ఎక్స్‌ప్రెస్, జనవరి 28న 22708 తిరుపతి–విజాగ్, అలాగే జనవరి 29న 22702 విజాగ్–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్