గురువారం రాత్రి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వీచిన ఈదురు గాలులకు NTR జిల్లాలో 50, కృష్ణా జిల్లాలో 80 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇబ్రహీంపట్నం పరిధిలో మూడు చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు కూడా కిందపడిపోయాయి. విద్యుత్ శాఖాధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈదురు గాలుల ధాటికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.