వ్యవసాయ రంగంపై అమ్మవారి దీవెనలు మెండుగా ఉండాలి: కలెక్టర్

శుక్రవారం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి, అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం కలెక్టర్ అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్నారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ రంగంపై, ప్రజలపై పుష్కలంగా ఉండాలని, జిల్లా సుభిక్షంగా వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్