పసిపాపను గోడకేసి కొట్టి చంపిన తల్లి ప్రియుడు!

విజయవాడలో వివాహేతర సంబంధం కారణంగా 18 నెలల పసిపాప దారుణ హత్యకు గురైంది. సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తెను, ఆమె ప్రియుడు వంశీ గొడవ పడుతూ కోపంతో గోడకేసి కొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి అడ్డుగా ఉందని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు గతంలో పోక్సో కేసులో జైలుకు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్