విజయవాడ భవానీపురంలో శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఆమెకు నివాళులర్పించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశామని ఎంపీ తెలిపారు. ప్రతి వారం ప్రజాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నది మంత్రి లోకేష్ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.