విజయవాడలో ఆర్టీసీ బస్సులో సీటు దొరకలేదని ఒక వ్యక్తి కండక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. చిల్లకల్లు వంతెన వద్ద బస్సు ఎక్కిన మహిళకు సీటు లేకపోవడంతో ఆమె కండక్టర్‌ను ప్రశ్నించింది. దీనికి మద్దతుగా ఆ వ్యక్తి కండక్టర్‌ను దుర్భాషలాడుతూ రెచ్చిపోయాడు. ఈ గొడవతో ప్రయాణికులు కాసేపు ఇబ్బంది పడ్డారు. తోటి ప్రయాణికులు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.