విజయవాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహించరాదని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. సోమవారం విజయవాడలోని బందర్ రోడ్, బెంజ్ సర్కిల్ నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు తెలిపారు.