ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజీ స్వర్ణోత్సవాల్లో మాట్లాడుతూ, రాబోయే 6 నెలల్లో అమరావతి నుంచి క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. గ్లోబల్ యూనివర్సిటీలను ఇక్కడికి తీసుకొస్తున్నామని, విజయవాడ-గుంటూరు-అమరావతి కలిపి ఒక అత్యుత్తమ లివబుల్ సిటీగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.