అక్రమ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని శనివారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజ్ కెసిరెడ్డి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెరికోజ్ వెయిన్స్ సమస్యతో మంగళగిరి ఎయిమ్స్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు.