ఉపాధి కల్పిస్తానని నమ్మించి, ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరై గుణదలకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలిని మహేశ్వరచారి మోసం చేశాడు. ఆమె 340 గ్రాముల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.30 లక్షల నగదు తీసుకున్నాడు. అదనంగా ఫోన్‌పే ద్వారా రూ.14 లక్షలు జమ చేయించుకున్నాడు. బాధితురాలు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.