విజయవాడ: చంద్రగ్రహణం.. గిరి ప్రదక్షిణ రద్దు

పాల్గుణ పౌర్ణమి నాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా, విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయం నేడు (మార్చి 3) ఉదయం 10 గంటలకు మూసివేయబడుతుంది. ఈ కారణంగా గిరి ప్రదక్షిణ, చండీ హోమం, పల్లకీసేవ వంటి ఆర్జిత సేవలు రద్దు చేయబడ్డాయి. రేపు (మార్చి 4) తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెరిచి, స్నపనాభిషేకం అనంతరం ఉదయం 8 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉంటుంది. భక్తులు ఈ మార్పులను గమనించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్