ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లోని నగరపాలక సంస్థతో పాటు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు, వడగండ్ల వానలు నమోదవుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యానికి తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.