విజయవాడ: నిండుకుండలా ప్రకాశం బ్యారేజీ

పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణానదికి విడుదల చేయడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. శనివారం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 12,335 క్యూసెక్కులు విడుదల చేశారు. తూర్పు ప్రధాన కాలువకు 9,328, పశ్చిమ ప్రధాన కాలువకు 3,007, కేఈ ప్రధాన కాలువ నుంచి రైవస్ కాలువకు 1,717, ఏలూరు 1,404, బందరు 1,452 క్యూసెక్కుల చొప్పున అందించారు.

సంబంధిత పోస్ట్