విజయవాడలోని పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, వైసిపి నాయకుడు అంబటి రాంబాబు చిత్రపటాలను దహనం చేశారు. ఈ ఘటనతో అంబటి రాంబాబు పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంబటి రాంబాబును తక్షణం అరెస్ట్ చేయాలని టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ డిమాండ్ చేశారు.