మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తోందని వివిధ విద్యార్థి, యువజన సంఘాలు మండిపడ్డాయి. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్, ఆర్వైఎస్ఎఫ్, ఏబీవీపీ ప్రతినిధులు మాట్లాడుతూ, 16 వేల మంది ఉపాధ్యాయుల భవిష్యత్తును దెబ్బతీసేలా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పారదర్శకంగా జరిగిన ప్రక్రియపై ఏడాది తర్వాత అక్రమాలంటూ నిరాధార ఆరోపణలు చేయడం సమంజసం కాదని, తక్షణమే ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.