విజయవాడలో డ్రగ్స్ కేసులో నిందితుడు అరెస్ట్

విజయవాడలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో నిందితుడు రాజేష్‌ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. డిసెంబర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కొందరిని అదుపులోకి తీసుకోగా, రాజేష్ పరారయ్యాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, మాచవరం క్రైమ్ కానిస్టేబుల్ తరుణ్, సీఐ రమణ సహకారంతో రాజేష్‌ను పట్టుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్