విజయవాడలోని భవానీపురంలో బెరంపార్క్ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. జనాలపైకి దూసుకొచ్చిన కారులో బాలుడితో సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు.