విజయవాడ కోర్టు ప్రాంగణంలో శుక్రవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హడావుడి చేశారు. పోలీసు వ్యాన్ నుంచి దిగిన వెంటనే రెండు చేతులతో దండం పెడుతూ, "నేనేమీ తప్పు చేయలేదు. మా పక్షాన దేవుడు ఉన్నాడు, న్యాయం జరుగుతుంది" అని అన్నారు. అక్రమ కేసులను ఎదుర్కొనడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెవిరెడ్డి ఈ సందరర్భంగా స్పష్టం చేశారు.