విజయవాడలోని అయోధ్యనగర్ పీహెచ్‌సీలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని చిన్నారులకు సోమ, మంగళవారం రోజున ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది చుక్కలు వేస్తారని తెలిపారు.