విజయవాడ నగరంలో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ప్రత్యేక విభాగం 'ఈగల్ టీం' దూకుడు ప్రదర్శించింది. పాతపాడు గువ్వలగట్టు ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు, నున్న పోలీసులతో కలిసి మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి సేవిస్తున్న నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టుబడిన నిందితులను అదుపులోకి తీసుకొని, తదుపరి విచారణ కోసం నున్న పోలీస్ స్టేషన్కు తరలించారు.