విజయవాడ సిట్ కార్యాలయానికి హాజరైన మాజీ ఐఏఎస్

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు తిరిగింది. సిట్ నోటీసులు అందుకున్న మాజీ ఐఏఎస్, నాటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ భార్గవ శుక్రవారం విజయవాడ సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. ఆయన తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్లు కూడా సమర్పించారు. డిస్టిలరీలు, సరఫరా కంపెనీలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వానికి నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబందించిన ఆధారాలు సిట్ కు లభించాయి.

సంబంధిత పోస్ట్