చీకటి పాలన నుంచి.. పారదర్శక పాలన దిశగా.. మాజీ మంత్రి ఉమా

కూటమి సర్కార్ పాలనలో రాష్ట్రం చీకటి పాలన నుంచి పారదర్శక పాలన దిశగా ముందుకు సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. బుధవారం గోళ్లపూడిలో మీడియాతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా ముందుకు సాగుతున్నారని, పోలవరం, అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దిశగా అడుగులు పడుతున్నాయని, విద్యారంగంలోనూ పెను మార్పులు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్