గొల్లపూడికి చెందిన 75 ఏళ్ల కొండవీటి నాగభూషణం జూలై 5 నుంచి కనిపించడం లేదు. ఈ మేరకు ఆయన కుమారుడు రవి భవానిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి వెళ్లిన తండ్రి తిరిగి రాకపోవడంతో అన్ని చోట్ల గాలించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ క్రమంలో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.