విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారి ఆలయంలో జూన్ 3న నిర్వహించిన హుండీ లెక్కింపులో 16 రోజుల వ్యవధికి రూ. 3,41,39,565 ఆదాయం లభించింది. భక్తులు 273 గ్రాముల బంగారం, 4.450 కిలోల వెండిని సమర్పించారు. అమెరికా, యూఏఈ, కెనడా, సింగపూర్, ఇంగ్లాండ్, ఖతార్, ఒమన్, దక్షిణాఫ్రికా, మలేషియా, నేపాల్ వంటి వివిధ దేశాల కరెన్సీ కూడా హుండీలో లభించింది. ఈ లెక్కింపులో భక్తుల కానుకలు భారీగా తరలివచ్చాయి.