కంకిపాడు: నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆస్వస్థతతో బాధపడుతూ, ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించిన కోట, 1978లో 'ప్రాణం ఖరీదు'తో సినీ రంగంలోకి వచ్చారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 750కి పైగా చిత్రాల్లో నటించారు. విలక్షణ పాత్రలతో పేరుగాంచిన ఆయన, 1999-2004లో విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు.

సంబంధిత పోస్ట్