కృష్ణలంక: మాటలతో మోసగించి నగదుతో పరారీ

కార్లను తాకట్టు పెట్టి నగదు తీసుకుని మోసాలకు పాల్పడ్డ యశ్వంత్‌ అనే వ్యక్తిని కృష్ణలంక పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడకు చెందిన యశ్వంత్‌ తమ్ముడు దీపక్‌, తండ్రి శ్రీనివాసరావుతో కలిసి హైదరాబాద్‌, విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల్లో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. దేవ్‌ అనే మీడియా వ్యక్తితో కలిసి 90కి పైగా యూపీఐ లావాదేవీలు జరిపి రూ.31.93 లక్షలు చెల్లించినట్టు కూడా తేలింది.

సంబంధిత పోస్ట్