కృష్ణలంక: వరదలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది

విజయవాడలోని కనకదుర్గమ్మ వారధి దిగువన వరద నీటిలో చిక్కుకున్న వ్యక్తిని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసిన ఘటన గురువారం జరిగింది. మతి స్థిమితం లేని నున్నకు చెందిన సెల్వరాజ్ (55) బుధవారం రాత్రి నదిలోని ఇసుక తిన్నెలపై నిద్రించాడు. ఉదయం బ్యారేజీ గేట్లు ఎత్తడంతో నీరు చేరింది. పోలీసుల సమాచారం మేరకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పడవతో వచ్చి రక్షించారు.

సంబంధిత పోస్ట్