ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయంలో సంతకం చేయాలన్న షరతుపై మినహాయింపు కోరుతూ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మద్యం కుంభకోణంలో బెయిల్ మంజూరు సమయంలో విధించిన ఈ షరతు ప్రకారం, వచ్చే శుక్రవారం సంతకానికి వెళ్లలేనని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.