విజయవాడకు చెందిన 43 ఏళ్ల దివ్యాంగుడు సునీల్‌కుమార్, తన తల్లితో కలిసి మూడు చక్రాల బండిపై సత్తెనపల్లి వెళ్తుండగా మేడికొండూరు(M) పాలడుగు అడ్డరోడ్డు వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టడంతో సునీల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని తల్లి గాయపడ్డారు. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.