విజయవాడ భవానిపురంలో షేక్ సుభాని అనే వ్యక్తి, గతంలో సేకరించిన మహిళ న్యూడ్ ఫోటోలను బంధువులకు, కాంటాక్ట్లకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళల భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.