విజయవాడలో ఆన్‌లైన్ హోటల్ బుకింగ్ పేరుతో మోసం జరిగింది. భవానీపురానికి చెందిన అబ్దుల్ రహీమ్ ఈ నెల 11న ఒక రిసార్ట్‌లో గది బుక్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక వెబ్‌సైట్‌లో దొరికిన వాట్సాప్ బుకింగ్ లింక్ ద్వారా ఒక ఫోన్ నంబర్‌ను సంప్రదించారు. అవతలి వ్యక్తి రూ. 20 వేలు జమ చేయాలని కోరగా, బాధితుడు ఆ మొత్తాన్ని జమ చేశాడు. డబ్బులు కట్టిన తర్వాత మోసపోయానని గ్రహించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.