పెరుగుతున్న వరద ఉద్ధృతి: ప్రకాశం బ్యారేజ్ కి తప్పిన ముప్పు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీకి ఇన్ఫ్రా 5.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో, ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్తున్న బోటును ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెంలో స్థానిక జాలర్లు అడ్డుకున్నారు. అధికారుల సహాయంతో బోటును ఒడ్డుకు చేర్చారు. గతంలో గేట్ల వద్ద బోట్లు ఇరుక్కున్న సంఘటనలు తెలిసిందే.

సంబంధిత పోస్ట్