గంగూరు జాతీయ రహదారిపై హంగామా.! (వీడియో)

గంగూరు ప్రాంతంలో జాతీయ రహదారిపై జరిగిన గొడవ కేసు నమోదు దశకు చేరింది. ఈ నెల 28వ తేదీ రాత్రి గంగూరు కూడలి వద్ద దీప్, మనోహర్, శివ, బాలకృష్ణ, వాసు, నారాయణరావు అనే ఐదుగురు వ్యక్తులు రహదారిపై వాగ్వాదానికి దిగి కొట్లాటకు పాల్పడ్డారు. ఈ ఘటనతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గొడవకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్