విజయవాడ బందర్ రోడ్డులోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ శనివారం విచ్చేశారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో బందర్ రోడ్డు కిక్కిరిసిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిసిన ఐశ్వర్యను చూసి అభిమానులు సందడి చేశారు. అనంతరం తన డ్యాన్స్ తో అభిమానులను అలరించారు.