విజయవాడ భవాని ద్వీపానికి పర్యాటకుల తాకిడి

విజయవాడలోని కృష్ణానది నడుమున గల భవానీ ద్వీపానికి పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో, శనివారం ఒక్కరోజే సుమారు 4500 మంది సందర్శించారు. వీరిలో 4100 మంది సాధారణ పర్యాటకులు, 212 మంది స్పీడ్ బోటులో వెళ్ళినవారు (11 మంది విఐపీలు) ఉన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ద్వీపానికి జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్