కొత్తపేట పోలీస్ స్టేషన్లో హోంగార్డు జానీ బక్రీద్ పండుగ సెలవులో ఉండగా, తన సొంత ఆటోలో భార్యతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. గురువారం కొత్తపేట పోలీస్ స్టేషన్ సమీపంలో ఈదురు గాలులు, అకాల వర్షంతో ఆ ప్రాంతమంతా నీట మునిగింది. ఈ క్రమంలో భారీ గాలివాన కారణంగా విద్యుత్ తీగ తెగి ఆటోపై పడటంతో విద్యుత్ షాక్తో జానీ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.