విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో దారుణ ఘటన జరిగింది. ఇంటి యజమాని బొద్దులూరి వెంకట రామారావు (70)ను హత్య చేసి, బంగారు ఆభరణాలు దొంగిలించి పని మనిషి అనూష పరారైంది. మూడు రోజుల కిందట పనిలో పెట్టుకున్న అనూష గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో భర్త సాయంతో రామారావుపై దిండు పెట్టి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.