విజయవాడ దుర్గగుడిలో అనుమతిలేకుండా భారీగా తినుబండారాలు తీసుకురావడం ఆలయ ఈవో శీనానాయక్ దృష్టికి వచ్చింది. గురువారం ఇంద్రకీలాద్రి దిగువన ఓ ఆటోలో హాట్‌బాక్సుల్లో ఆహారం తెచ్చి, భక్తులకు పంపిణీకి యత్నించారు. లిఫ్ట్ ప్రాంతం దాటి వస్తుండగా ఈవో గమనించి ప్రశ్నించగా స్పష్టత లేకపోయింది. సెక్యూరిటీ సిబ్బందిలో నిర్లక్ష్యం కారణంగా నలుగురిని విధుల నుంచి తొలగించారు.