విజయవాడకు చెందిన న్యాయవాదిని కిడ్నాప్ చేసి ఆస్తులు రాయించుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు కర్నాటి వీరభద్రరావును పటమట పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 12న అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఆయనను న్యాయస్థానం అనుమతితో పోలీసులు విచారిస్తున్నారు. తొలిరోజు విచారణలో కీలక అంశాలపై ఆరా తీశారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.